Bhairavi : సరికొత్త సోషియో ఫాంటసీ సీరియల్‌.. ‘భైరవి’ టీవీలో టెలికాస్ట్ ఎప్పట్నించి అంటే..?

తాజాగా మరో కొత్త సోషియో ఫాంటసీ సీరియల్‌ 'భైరవి' రాబోతుంది.

Socio Fantasy Serial Bhairavi Starting soon

Bhairavi Serial : తాజాగా మరో కొత్త సోషియో ఫాంటసీ సీరియల్‌ ‘భైరవి’ రాబోతుంది. ఒక బాగా డబ్బున్న కుటుంబంలో చాలా రోజుల తర్వాత ఏకైక ఆడపిల్ల పుట్టడంతో ఆ ఇంటి దేవత భైరవీదేవి అని పేరు పెడుతుంది తల్లి శివగామి. కానీ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఆరేళ్ళ భైరవిని సొంత చిన్నాన్న చంపేస్తాడు. ఆ తర్వాత శివగామిని పిచ్చిదాన్ని చేసి వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అనుకోకుండా తాను చంపిన భైరవి తిరిగి వస్తుంది. చనిపోయిన భైరవి ఎలా వచ్చింది? అమ్మవారే భైరవి రూపంలో వచ్చారా? లేక భైరవి దయ్యమై వచ్చిందా? తన తల్లిని పిచ్చివాళ్ళను చేసిన వాళ్ళపై భైరవి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, తన తల్లి జీవితాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని భైరవి ఎలా సరిదిద్దింది అనే కథాంశంతో ఈ సీరియల్ నడవనుంది.

Also Read : Kriti Kharbanda : ఘనంగా హీరోయిన్ కృతి ఖర్బందా వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు..

భైరవి సీరియల్ థ్రిల్లింగ్‌ అంశాలతో సాగనుంది. జెమినీ టీవీలో ఈ నెల మార్చ్ 18 నుండి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ సీరియల్ లో ఆకాంక్ష గాంధీ, బేబీ రచన, భరద్వాజ్‌ కావ్యరెడ్డి, వీణా పొన్నప్ప, బసవరాజ్‌, రోహిత్‌, డాలీ, శిల్పా గౌడ, రోహిత్‌ నాయర్‌.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.