Kriti Kharbanda : ఘనంగా హీరోయిన్ కృతి ఖర్బందా వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు..
ఢిల్లీలో కృతి ఖర్బందా - పుల్కిత్ సామ్రాట్ లు నిన్న మార్చ్ 15న ఘనంగా వివాహం చేసుకున్నారు.

Kriti Kharbanda Pulkit Samrat Wedding Happened in Delhi Photos goes Viral
Kriti Kharbanda : తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించిన కృతి ఖర్బందా తాజాగా నిన్న మార్చ్ 15న ఓ నటుడిని వివాహం చేసుకుంది. కృతి ఖర్బందా 2019 నుంచి పుల్కిత్ సామ్రాట్ అనే నటుడితో ప్రేమలో ఉంది. ఇటీవల కొన్ని నెలల క్రితం వీరు సీక్రెట్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు.
ఢిల్లీలో కృతి ఖర్బందా – పుల్కిత్ సామ్రాట్ లు నిన్న మార్చ్ 15న ఘనంగా వివాహం చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వివాహ వేడుక జరిగింది. ఇక కృతి ఖర్బందా – పుల్కిత్ సామ్రాట్ తమ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి.

Also Read : Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ పూర్తి.. విదేశాల నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన విజయ్..
త్వరలోనే ఈ జంట ముంబైలో బాలీవుడ్ కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ కొత్త జంటకు పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.