Son Of OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’.. ఆహాలో స్ట్రీమింగ్.. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లోకి

ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సన్ ఆఫ్(Son Of OTT) సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రానుంది.

son of movie coming soon on amazon prime

Son Of OTT: సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘సన్ ఆఫ్(Son Of OTT)’. బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి సైన్మా బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలై విశేష ఆదరణ పొందింది. తండ్రి కొడుకుల మధ్య సాగే భావోద్వేగభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ తండ్రిగా, సాయి సింహాద్రి కొడుకుగా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Toxic: మరోసారి ‘టాక్సిక్’ వాయిదా.. విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

పల్లెటూరు నేపథ్యంతో, ఆహ్లాదకరమైన కామెడీ, ఎమోషనల్ సీన్స్, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను అలరించాయి. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో సక్సెస్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం హనుమాన్ మీడియా ద్వారా ‘ఆహా’ (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా, మే 1 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను ఓటీటీ వేదికగా తప్పకుండా వీక్షించాలని చిత్ర యూనిట్ కోరుతోంది.