Salman-Sonakshi: బాలీవుడ్ కండల వీరుడు, భజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాల్లో లెక్కలేనన్ని రూమర్లు వినిపించగా అందులో కొందరితో పెళ్లి కూడా అయిపోయిందంటూ ప్రచారాలు కూడా చాలానే జరిగాయి. అయితే కొంత కాలంగా ప్రేమ, లవ్, రిలేషన్లకు దూరం ఉండగా అప్పటి నుండి సల్మాన్ పెళ్లి విషయంపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా సల్మాన్ పెళ్లిపై మరో రూమర్ తెర పైకి వచ్చింది. హీరోయిన్ సోనాక్షి సిన్హాను సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోతో రూమర్ మొదలైంది.
Salman Khan : కత్రినాకైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్.. మీ వివాహంతో అందరూ…
చక్కర్లు కొడుతున్న ఫోటోలలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా ఉంగరాలు మార్చుకుంటుండడంతో.. నెటిజన్లు కొందరు ఇది నిజమే, ఈ ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ నమ్మేశారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఆ ఫోటో పక్కా ఫేక్. రూమర్స్ వ్యాప్తి చేయడం కోసమే కొంతమంది కావాలని దాన్ని క్రియేట్ చేశారు. ఇదే విషయంపై స్పందించిన సోనాక్షి కూడా ఫేక్ ఫోటోకు ఒరిజినల్ ఫోటోకు తేడా తెలియదా అంటూ మండిపడింది.
Salman Khan : పరువు నష్టం దావా వేసిన సల్మాన్..ఎవరి మీదో తెలుసా ?
సల్మాన్, తనకు ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉన్న వైరల్ ఫొటో కింద దాన్ని నిజమని నమ్మినవాళ్లని మూర్ఖులుగా అభివర్ణించింది. రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారయ్యారా అంటూ మూడు లాఫింగ్ ఎమోజీలను తన కామెంట్‌కు జత చేసింది. ఒకవిధంగా నాలుగైదు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి సోనాక్షి రియాక్షన్ తో తెరపడగా.. అయితే అసలు ఇలాంటి ఫేక్ వార్తలకు సోనాక్షి స్పందించకుండా ఉంటేనే బావుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.