Salman Khan : పరువు నష్టం దావా వేసిన సల్మాన్..ఎవరి మీదో తెలుసా ?

కేతన్ నెల రోజుల క్రితం ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడాడు. ఈ క్రమంలో కేతన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్..

Salman Khan : పరువు నష్టం దావా వేసిన సల్మాన్..ఎవరి మీదో తెలుసా ?

Salman Khan

Updated On : January 16, 2022 / 2:02 PM IST

Salman Khan Has Filed A Suit : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను వెంటనే తొలగించాలి..లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయబృందం కోర్టును కోరింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారని బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌ సమీపంలో ఉండే వ్యక్తి కేతన్‌ కక్కడ్‌పై ముంబయి సిటీ సివిల్‌ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు కంప్లైట్ దాఖలు చేశారు. వెంటనే ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయ బృందం కోర్టును కోరింది.

Read More : Weather Forecast : తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు

కేతన్ నెల రోజుల క్రితం ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడాడు. ఈ క్రమంలో కేతన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా సంస్థలనూ ఈ కేసులో చేర్చారు. సల్మాన్‌ను దూషిస్తూ, అవమానిస్తూ పోస్టులు పెట్టడం, కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయడం, ట్వీట్లు, ఇంటర్వ్యూలు, ప్రింటింగ్, పబ్లిషింగ్, బ్రాడ్‌కాస్టింగ్ తదితర అన్ని మార్గాలపై నిషేధం విధించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సల్మాన్‌ న్యాయ బృందం కోర్టును కోరింది. మరోవైపు కేతన్‌ తరఫు న్యాయవాదులు ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు కేతన్‌కు అనుకూలంగా సమయం మంజూరు చేసింది. కేసును ఈ నెల 21కి వాయిదా వేసింది.