Sonu Sood : నా గుండె బద్దలైంది.. శివశంకర్ మాస్టర్ మృతిపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్
శివశంకర్ మాస్టర్ ఇక లేరు అనే వార్త తెలిసి తన గుండె బద్దలైంది. ఆయన్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ దేవుడికి ఇతర ప్లాన్లు ఉన్నట్టున్నాయి.
- Naveen
- Updated on- November 29, 2021 / 08:37 AM IST
Sonu Sood Shiva Shankar
Sonu Sood : కరోనాబారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు 75శాతం ఇన్ ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఆయన్ను బతికించలేకపోయారు. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు శివశంకర్ మాస్టర్ మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Siva Shankar Master: కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత
”శివశంకర్ మాస్టర్ ఇక లేరు అనే వార్త తెలిసి తన గుండె బద్దలైంది. ఆయన్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ దేవుడికి ఇతర ప్లాన్లు ఉన్నట్టున్నాయి. మేము మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము మాస్టర్ జీ. మీరు లేని లోటు నుంచి బయటపడేలా మీ కుటుంబానికి శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని సినిమా ఎప్పటికీ మిస్ అవుతుంది సర్” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.
కాగా, శివశంకర్ మాస్టర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, దాతలు సాయం చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరిన విషయం తెలియగానే హెల్పింగ్ స్టార్ సోనూసూద్ స్పందించారు. సాయం చేసేందుకు ముందుకొచ్చారు. శివశంకర్ మాస్టర్ చిన్న కొడుక్కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. ఇంతలోనే తీరని విషాదం చోటు చేసుకుంది. మాస్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..
శివశంకర్ మాస్టర్ కుటుంబ సభ్యుల్లో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడ్డారు. మాస్టర్ పెద్ద కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో శివ శంకర్ మాస్టర్ చిన్నకొడుకు అజయ్ కృష్ణ తన కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటున్నారు.
