మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్!

  • Published By: sekhar ,Published On : October 5, 2020 / 01:37 PM IST
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్!

Updated On : October 5, 2020 / 2:25 PM IST

Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి బాధితులు, పేదలకు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న నటుడు సోనుసూద్‌ మరోసారి ఉదారతను ప్రదర్శించారు.

హర్యానా లోని మొర్ని గ్రామంలో ఒక చిన్న పిల్లాడు ఆన్‌లైన్ క్లాసెస్ కోసం మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మొబైల్ నెట్వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి ఆన్ క్లాసిస్ వింటున్నాడు. చెట్టు ఎక్కితే గాని నెట్ వర్క్ రాని పరిస్థితి.

Morni Village

అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ అబ్బాయి వార్తను Karan Gilhotra ట్విట్టర్ ద్వారా సోనుసూద్ కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న సోనుసూద్ వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి Airtel టవర్ అక్కడ స్థాపించడం జరిగింది.

ఇప్పుడు ఆ గ్రామంలో నెట్‌వర్క్ సమస్య లేదు. స్టూడెంట్స్ కోసం సోనుసూద్ చేసిన ఈ పనికి ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియచేశారు. సోనూ సూద్ ఇటీవల ఛండీగఢ్‌ లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ అందచేసిన సంగతి తెలిసిందే.