నెల్లూరు నాగలక్ష్మి గారు.. మీరు గ్రేట్.. చాలా రిచ్- సోనూసూద్

Sonu Sood Naga Laxmi

కరోనావేళ పోరాడుతున్న వ్యక్తుల్లో ఒకరు సోనూసూద్.. ప్రతీరోజూ వేలాదిమందికి సాయం చేస్తూ దేవుడు అని ప్రశంసించబడుతోన్న సోనూసూద్.. లేటెస్ట్‌గా సోనూసూద్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో నాగలక్ష్మీ అనే యువతిని అభినందించారు.

కళ్లు సరిగ్గా కనిపించని బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కి రూ.15వేలు విరాళంగా అందచేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన దృష్టిలో నాగలక్ష్మి రిచెస్ట్ ఇండియన్ అని అన్నారు. బాధలను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు. తను విరాళం ఇచ్చిన 15 వేలు నాగలక్ష్మి ఐదు నెలల పెన్షన్ అని వాటిని మంచికోసం ఖర్చుపెట్టమని పంపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సోనూసూద్.


నాగలక్ష్మి కూడా సోనూసూద్ ట్వీట్‌పై ఓ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.