NBK’s Narthanasala: ద్రౌపదిగా సౌందర్య

  • Publish Date - October 21, 2020 / 05:46 PM IST

Narthanasala Soundarya Look: సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన Mythological Epic ‘‘నర్తనశాల’’..


ఇప్పటివరకు బాలయ్య అర్జునుడు, శ్రీహరి భీముడు క్యారెక్టర్ల లుక్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. బుధవారం సాయంత్రం ద్రౌపది పాత్ర లుక్ విడుదల చేశారు. సౌందర్య లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె అకాలమరణం కారణంగా బాలయ్య ఎంతో ఇష్టపడ్డ ‘నర్తనశాల’ చిత్రాన్ని ఆపేశారు.


దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా విజయదశమి సందర్భంగా NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నారు. టికెట్ ధర రూ.50 గా నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు.