RIP SPB : బాలు గురువు ఎవరు ?

  • Publish Date - September 26, 2020 / 10:59 AM IST

sp balasubrahmanyam : గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం గురువు ఎవరు ? ఆయన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు బాలు. బాలు గురువు ఎస్. పి. కోదండ పాణి. జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటానని పలు సందర్భాల్లో బాలు వెల్లడించారు. మద్రాసులో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ పాటల పోటీ నిర్వహించింది.



జడ్జీలుగా ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి వచ్చారు. ఇందులో బాలు పాల్గొన ఓ పాట పాడారు. దీనికి ఫస్ట్ ఫ్రైజ్ ఇచ్చారు. బాలుని పరిచయం చేసుకున్నారు. తాను సంగీత దర్శకుడు కోదండపాణి అని ‘నీ గొంతు బాగుంది. నువ్వు డిసిప్లిన్‌తో ఉంటే నలభై ఏళ్లు ఇండస్ట్రీలో పాడతావు’ అని ఆశీర్వదించారాయన.
ఆయన ఏమన్నారో కానీ..బాలు వెనక్కి తిరిగి చూడలేదు.



తన పాటలతో అభిమాలను అలరించారు. బాలూను మెచ్చుకొని ఊరుకోలేదు. తన వెంట ఉంచుకున్నారు. పాటల మెలకువలు నేర్పారు. చాలామంది సంగీత దర్శకుల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. తొలి పాటకు అవకాశం ఇచ్చారు. ఆయన సంగీత దర్శకత్వంలో పాడిన ‘మేడంటే మేడా కాదు’ పాట బాలూకు మంచి గుర్తింపు తెచ్చింది.



అందుకే ఎస్‌.పి.కోదండపాణి పేరు తన రికార్డింగ్‌ థియేటర్‌కు పెట్టుకున్నారు బాలు. అంతేకాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా ఎస్‌.పి.కోదండపాణి ఫిల్మ్‌ సర్క్యూట్‌గా ఉంచారు.