Buchibabu Sana: బుచ్చిబాబు బర్త్ డే.. పెద్ది నుంచి స్పెషల్ వీడియో.. విజువల్స్ అదిరిపోయాయి
దర్శకుడు బుచ్చిబాబు సన(Buchibabu Sana) పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీ నుండి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
- V Santhosh Kumar
- Published On : February 15, 2026 / 12:48 PM IST
Special video from Peddi on the occasion of Boochi Babu's birthday
Buchibabu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా(Buchibabu Sana) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీ రోల్స్ చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Nagabandham Teaser: విజువల్ వండర్ గా నాగబంధం టీజర్.. విడుదల చేసిన మహేష్ బాబు
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15 దర్శకుడు బుచ్చిబాబు సన బర్త్ డే సందర్బంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక రామ్ చరణ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ప్రతీ సీన్ కోసం బుచ్చిబాబు పడుతున్న కష్టం చూస్తుంటే పెద్ది సినిమా అనేది ఆయనకు ఎంత స్పెషల్ అనేది క్లియర్ గా అర్థం అవుతోంది. కాబట్టి, పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని తెలుస్తోంది.
ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి సాంగ్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో సాంగ్ కూడా విడుదల కానుంది. ఆ సాంగ్ విడుదలపై ఫిబ్రవరి ఎండింగ్ లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
