Sreeleela : అనుకున్నది ఒకటి అయిందొకటి.. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ చేంజ్.. స్టార్ హీరోతో అనుకుంటే..
ఇప్పటివరకు సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఫామ్ చూపించిన శ్రీలీల ప్రజెంట్ నార్త్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. (Sreeleela)
- Saketh U
- Published on- August 19, 2026 / 09:46 AM IST
Sreeleela
Sreeleela : సౌత్‌లో అసలు ఏ మాత్రం టైమ్ కలిసి రావడం లేదు శ్రీలీలకి. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవుతుండంతో ఇక బాలీవుడ్ మీదే భారం వేస్తోంది సౌత్ బ్యూటీ. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటివరకు సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఫామ్ చూపించిన శ్రీలీల ప్రజెంట్ నార్త్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
సౌత్‌లో ఎన్ని ఫ్లాపులున్నా నార్త్‌లో మాత్రం క్రేజీ ఆఫర్స్‌తో బిజీ అవుతోంది శ్రీలీల. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా అనురాగ్ బసూ తెరకెక్కిస్తోన్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటిస్తోంది శ్రీలీల. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. కార్తీక్ – శ్రీలీల మధ్య రిలేషన్ ఉందని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. ఇప్పటివరకూ వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్‌గా మొదలైనట్లు తెలుస్తోంది. ముంబైలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో శ్రీలీల జాయిన్ అయ్యినట్లుగా తెలుస్తోంది.
Also Read : Tollywood Directors : ఈ ముగ్గురికి ఆ ముగ్గురు ఛాన్స్ ఇస్తారా..?
అయితే కార్తీక్ ఆర్యన్ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉంటుందనుకుంటే ఇప్పుడు ఈ ఈక్వెషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలై అనేక కారణాలతో వాయిదా పడుతుంది కార్తీక్ ఆర్యన్-అనురాగ్ బసూ సినిమా. దీంతో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా డెబ్యూ ఇస్తోన్న దిలేర్ సినిమానే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ అవుతుందని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా ఈ ఇయర్ దీపావళి వీకెండ్‌కి విడుదల చేసే ప్లానింగ్‌తో ఉన్నారట మేకర్స్.
కార్తీక్ ఆర్యన్-శ్రీలీల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రేసులో వెనక్కి వెళ్లడం మీద ఇంట్రస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సైయారా తర్వాత మళ్లీ అదే రూట్లో మరో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌తో వస్తే ఆడియెన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే డైలమాతోనే మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు కార్తీక్ ఆర్యన్ లాస్ట్ సినిమా తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వడం కూడా మరో రీజన్ అంటున్నారు. దీంతో స్టార్ హీరోతో బాలీవుడ్ లో డెబ్యూ యుద్ధం అనుకుంటే ఇలా కొత్త హీరోతో ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. మరి శ్రీలీల ఫస్ట్ హిందీ సినిమా దిలేర్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Also Read : Chiranjeevi : చిరంజీవి హాలీవుడ్ సినిమా ‘అబు’.. 40 కోట్లతో.. అప్పటి విషయాలు బయటపెట్టిన దర్శకులు..
