Sreeleela Talk about her Mother in Balakrishna Unstoppable Show
Sreeleela Mother : తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 నుంచి ఆరో ఎపిసోడ్ ని రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వచ్చి సందడి చేసారు. ఆహా ఓటీటీలో ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ ఎపిసోడ్ లో శ్రీలీల, నవీన్ బోల్డంత ఫన్ ఇవ్వడమే కాక తమ లైఫ్ స్టోరీలు కూడా షేర్ చేసుకున్నారు.
Also Read : సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
శ్రీలీల తల్లి తండ్రులు ఆమె చిన్నప్పుడే విడిపోవడంతో ఆమె తల్లి సింగిల్ మదర్ గా డాక్టర్ గా కష్టపడుతూ శ్రీలీలను పెంచిన సంగతి తెలిసిందే. దీని గురించి శ్రీలీల మాట్లాడుతూ.. సింగిల్ మదర్ గా అమ్మ చాలా కష్టపడింది. చిన్నప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు రాకుండా నన్ను చాలా బిజీగా ఉంచేది. అన్ని నేర్చుకోమనేది. మాములు మెడల్స్ వచ్చినా పట్టించుకునేది కాదు. అప్పుడు నాకు అర్ధమయ్యేది కాదు. అమ్మ మీద కోపం వచ్చేది. అమ్మ మీద కంప్లైంట్స్ చేసేదాన్ని. కానీ అలా ఎందుకు చేసింది పెద్దయ్యాక అర్థమైంది. చిన్నప్పుడు నాకు అన్ని విషయాలు అమ్మ చెప్పలేకపోయేది. అందుకే నన్ను ఎక్కువగా బిజీగా ఉంచేది. ఇప్పుడు పెద్దయ్యాక నేను అర్ధం చేసుకోగలిగాను. మా అమ్మ అలా ఉండటానికి కారణం ఏంటి అని పెద్దయ్యాక అర్థమైంది. ఆమె లైఫ్ అంటే నేనే. తన సంతోషం కోసం మా అమ్మ ఏమి చేసుకోలేదు. నా కోసమే 20 ఏళ్లుగా కష్టపడుతుంది. ఆమె గర్వపడేలా చెయ్యాలి నేను అని చెప్తూ కాస్త ఎమోషనల్ అయింది.
ఇక షోలోకి శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత కూడా వచ్చింది. శ్రీలీలని హగ్ చేసుకొని తన ప్రేమని కురిపించింది. బాలయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంది. శ్రీలీల తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. నా ట్రబుల్స్ నేను ఫేస్ చేస్తూనే తనని పెంచాను. ఆ దేవుడు మాకు తోడు ఉన్నాడు అని తెలిపింది. దీంతో శ్రీలీల – ఆమె తల్లి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.