Sri Vidya : ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి.. ఆ పనులతో అమ్మాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు.. శ్రీవిద్య వ్యాఖ్యలు వైరల్..
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. (Sri Vidya)
- Saketh U
- Published on- November 16, 2026 / 06:18 PM IST
Sri Vidya
Sri Vidya : యాంకర్, నటి, జబర్దస్త్ ఫేమ్ శ్రీవిద్య ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో మంచి విజయం సాధించి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
శ్రీవిద్య హాస్టల్ లో ఉంటున్నాను ఇప్పటికి అని చెప్తే ఇంటర్వ్యూలో.. కొంతమంది అమ్మాయిలు ఊరి నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ లో ఉంటూ తప్పుడు నిర్ణయాలతో లైఫ్ నాశనం చేసుకుంటున్నారు కదా అని అడిగారు.
Also Read : Jabardasth Pavithra : ఫీవర్ తోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ.. జబర్దస్త్ పవిత్ర ఫొటోలు..
శ్రీవిద్య దీనిపై స్పందిస్తూ.. ఇంటి దగ్గర ఉంటె భయం ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక రోజు ఫోన్ చూస్తే దొరికిపోతాము. కానీ ఊరు కానీ ఊళ్ళో ఇక్కడ ఉన్నాము. వాళ్ళ ఫోన్ ఎత్తము, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటారు. చాలా మంది అమ్మాయిలు లైఫ్ ఇలాగే స్పాయిల్ చేసుకుంటారు. ఆ అబ్బాయితో వెళ్ళు, హాస్టల్ కి రాకు మేము మేనేజ్ చేస్తాము అని హాస్టల్ మెట్స్ ఎంకరేజ్ చేస్తారు. పబ్ కి వెళ్దాం, తాగుదాం పబ్ కి వెళ్తే డబ్బున్న అబ్బాయిలు పరిచయం అవుతారు అని చెప్తారు. ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయిలు మెసేజ్ చేసి కలుద్దాం అంటే వెళ్ళిపోతారు కొంతమంది.
సరైన గైడెన్స్ లేక, పక్కన పేరెంట్స్ లేక అమ్మాయిలు అలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. భర్త ఉన్న ఒక ఆమె మా హాస్టల్ లో ఉంటుంది. చదువుకుంటాను అని చెప్తే వాళ్ళ ఆయన నమ్మి పంపిస్తే ఇక్కడ హాస్టల్ లో జాయిన్ అయిన రెండో రోజే బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసింది. అమ్మాయిలు అందరూ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు అని ఆమె లైఫ్ నాశనం చేసుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. .
