Peddi : ‘పెద్ది’లో స్పెషల్ శ్రీకాకుళం సాంగ్.. భారీగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు..

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

Peddi

Peddi : మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతోంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్‌ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. రామ్‌చరణ్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.

అయితే ఈ సినిమాలో శ్రీకాకుళం జానపద గీతం ‘మా ఊరు ప్రెసిడెంట్..’ గేయం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. దీన్ని ప్రముఖ గాయకుడు పెంచల్ దాస్ పాడినట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలువనుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ లైనప్ మాములుగా లేదుగా.. ఏకంగా అరడజను సినిమాలు..

పెద్ది సినిమాలో ఈ స్పెషల్‌ సాంగ్ కోసం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని, ఇందులో వందమంది డాన్సర్లతో పాటు చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రంగస్థలంలో జిగేలు రాణి పాట లాంటి మ్యాజిక్‌ని ఈ సాంగ్‌లోనూ సృష్టించేందుకు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ స్టెప్పులేసే అవకాశం ఉందని గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ పెద్దిలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ మూవీగా, ఏఆర్. రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో మార్చ్ 2026లో విడుదల కానుంది. మరి శ్రీకాకుళం స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Also Read : Coolie : ర‌జ‌నీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ నాగార్జున వర్సెస్ సూపర్ స్టార్ రజినీ..