Srikanth : హీరో శ్రీకాంత్‌కు కరోనా పాజిటివ్
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న శ్రీకాంత్ కి తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని శ్రీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ''అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు...
- Saketh U
- Published on- January 26, 2022 / 12:47 PM IST
Srikanth
Srikanth : ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ ను కరోనా థర్డ్ వేవ్ ఆగకుండా వెంటాడుతోంది. ఇవాళ చిరంజీవికి కూడా కరోనా సోకినట్టు తెలిపారు. తాజాగా చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే మరో హీరోకి కూడా కరోనా సోకింది.
Republic Day : రామ్ చరణ్, బాలయ్య బాబు గణతంత్ర వేడుకలు
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న శ్రీకాంత్ కి తాజాగా కరోనా సోకింది. ఈ విషయాన్ని శ్రీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. ”అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి” అని పోస్ట్ చేశాడు.
Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్
