Srinath Chandrashekar : టాలీవుడ్లో మరో తెలంగాణ దర్శకుడు.. చంద్రుడి మీదకు రాకెట్ అంటూ..
దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Srinath Chandrashekar)
- Saketh U
- Published on- November 13, 2026 / 09:09 PM IST
Srinath Chandrashekar
Srinath Chandrashekar : ఇటీవల టాలీవుడ్ లో తెలంగాణ దర్శకుల హవా పెరుగుతుంది. బలగం, పరేషాన్, రాజు వెడ్స్ రాంబాయి.. ఇలా తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ లోకి మరో తెలంగాణ దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. తెలంగాణలోని సిద్ధిపేట నుంచి వచ్చిన దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ చంద్రయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నేడు నవంబర్ 13న థియేటర్స్ లో రిలీజయింది.
సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : Dada Song : బాలకృష్ణ ‘దాదా’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య పాడిన పాట ఎలా ఉంది..?
శ్రీనాథ్ చంద్రశేఖర్ తన సినీ పరిశ్రమ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. మాది సిద్దిపేట దగ్గర హుస్నాబాద్ అనే ఊరు. చదువుకునేటప్పటనుంచే సినిమాలంటే ఆసక్తి. బిటెక్ చదువుతున్నప్పుడే ఛార్మి మంగళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమా 3G లవ్ కి కూడా దర్శకత్వ శాఖలో చేశాను. తర్వాత కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, మ్యాథ్స్ ట్యూటర్ గా పనిచేసాను. కానీ సినిమాల మీద ఇష్టంతో అవన్నీ వదిలేసి ఇండస్ట్రీలోకి పూర్తిగా వచ్చేసాను. రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా అనేక సినిమాలకు ఈటీవీ, జెమిని, జీటీవీ లోని సీరియల్స్ కు పనిచేసాను. దర్శకులు నీలకంఠ, కన్మణి వద్ద పనిచేసాను. సాధారణంగా సినిమా వాళ్లకు ఉండే కష్టాలు, అసిస్టెంట్ డైరెక్టర్ కి ఉండే కష్టాలు అన్ని పడే దాదాపు పదేళ్లకు పైగానే సినీ పరిశ్రమలో పనిచేసి ఇప్పుడు దర్శకుడిని అయ్యాను అని తెలిపారు.
చంద్రయాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఊళ్ళో ఉన్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ప్రేమించిన అమ్మాయి ఎవరెవరితోనో పోలుస్తూ నువ్వేమి చేయలేవా అంటే రాకెట్ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఊళ్ళల్లో ఉండే కుర్రాళ్ళు, వారి మధ్య కామెడీతో, ఊళ్ళల్లోని జనాలు, ప్రేమ, చంద్రుడి మీదకు రాకెట్ ప్రయోగం.. వంటి అంశాలతో ఈ కథని రాసుకున్నాను. సినిమా తెరకెక్కించేటప్పుడు రియల్ లొకేషన్స్ కావడంతో మొదటి సినిమాకు చాలానే కష్టాలు పడ్డాను. సినిమా అయ్యాక దర్శకుడు వేణు ఉడుగుల గారు మా సినిమా చూసి నచ్చడంతో ఆయనే రిలీజ్ చేస్తామని ముందుకు వచ్చారు. నా మొదటి సినిమానే ఆయన రిలీజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది అని అన్నారు.
Also See : Anchor Neha Chowdary : సముద్రంపై సర్ఫింగ్ చేస్తున్న బిగ్ బాస్ భామ.. యాంకర్ నేహా చౌదరి ఫొటోలు..
అలాగే.. నా దగ్గర మరికొన్ని కథలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఒకరిద్దరు హీరోలకు ఆల్రెడీ నెరేషన్స్ ఇచ్చారు. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. నెక్స్ట్ సినిమా ఓకే అవ్వగానే అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణ సంసృతి భాగంగా చూపిస్తూనే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలనేదే నా కోరిక అని తెలిపారు దర్శకుడు శ్రీనాథ్.
