×
Ad

Mension House Mallesh : ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ.. తాగుబోతుకి శృంగారంలో ఆ సమస్య ఉంటే..

మెన్షన్ హౌస్ మల్లేష్ అని టైటిల్ తో, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొల్పారు. (Mension House Mallesh)

  • Published On : March 6, 2026 / 08:46 PM IST

Mension House Mallesh

Mension House Mallesh : శ్రీనాథ్ మాగంటి, గాయత్రీ రమణ జంటగా తెరకెక్కిన సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మాణంలో బాల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, పద్మ, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా నేడు మార్చ్ 6న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) తన తండ్రి తాగొచ్చి రోజూ కొడుతున్నాడని అతన్ని కొట్టి చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోతాడు. తన తండ్రి చనిపోయాడని తెలిసి కొన్నాళ్ళకు తిరిగొచ్చినా మల్లేష్ కూడా తాగుడికి బానిస అవుతాడు. తనకున్న టెంట్ హౌస్ చూసుకుంటూ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. తన మామ కొడుకు చిన్న పటేల్ (రాజేష్)తో మల్లేష్ కి కొన్ని ఫ్యామిలీ గొడవలు, ఓ పొలం గొడవ ఉంటుంది. మల్లేష్ – చిన్న పటేల్ కి పడదు. పెళ్లి చేస్తే సెట్ అవుతాడని మల్లేష్ తల్లి అబద్దాలు చెప్పి జ్యోతి(గాయత్రీ రమణ) సంబంధం తెస్తుంది. పెళ్లి దగ్గర చిన్న పటేల్ గొడవ చేసినా ముందే జ్యోతికి అన్ని నిజాలు చెప్పే మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు.

మొదటి రాత్రి రోజు మల్లేష్ కి అంగస్తంభన సమస్య ఉందని తెలుస్తుంది. ఏం చేసినా ఆ సమస్య తీరదు. భార్య జ్యోతి అర్ధం చేసుకున్నా ఈ విషయం బయటకు తెలిసి చిన్న పటేల్ అందరి ముందు మల్లేష్ పరువు తీస్తాడు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఓ పందెం కట్టుకుంటారు. మల్లేష్ – చిన్న పటేల్ ఏం పందెం వేసుకున్నారు? అసలు వీరిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి? జ్యోతితో సంతోషంగా మల్లేష్ ఉంటాడా? అసలు మల్లేష్ ఎందుకు తాగుడికి బానిస అయ్యాడు? మందు మానేస్తాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Saraswathi : ‘సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..?

సినిమా విశ్లేషణ..

మెన్షన్ హౌస్ మల్లేష్ అని టైటిల్ తో, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ఫస్ట్ హాఫ్ అంతా మల్లేష్ క్యారెక్టర్, పెళ్లి, చిన్న పటేల్ తో గొడవలు, మల్లేష్ కి ఉన్న సమస్య బయటపడటం, దాన్ని చిన్న పటేల్ అందరి ముందు పెట్టడంతో వీరిద్దరూ వేసుకునే పందెంతో ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్ట్ గానే సాగుతుంది. మొదట ఓ ఇరవై నిముషాలు సాగదీసినా పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి అడల్ట్ కామెడీతో బాగానే నడిపించారు. ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.

అయితే సెకండ్ హాఫ్ లో కూడా అంతే అడల్ట్ కామెడీ ఉంటుందని ఊహిస్తే కాస్త ఎమోషన్ తో పాటు అక్కర్లేని ఫ్లాష్ బ్యాక్ లతో సాగదీశారు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ కట్ చేయొచ్చు. అసలు హీరో తండ్రి ఫ్లాష్ బ్యాక్ కథకి సంబంధం లేకపోయినా రెండు వేరియేషన్స్ తో ఎందుకు చూపించారో దర్శకుడికే తెలియాలి. కామాక్షి పాత్రకి సడెన్ గా ఇచ్చిన ఎలివేషన్స్ ఊహించొచ్చు కానీ ఆమె బ్యాక్ డ్రాప్ ఏంటో చెప్పకుండా ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం గమనార్హం. ఎంత తండ్రి నచ్చకపోయినా తండ్రి ఫోటో మీద డ్రాయర్ ఆరేయడం లాంటి వరస్ట్ ఆలోచనలు దర్శకుడికి ఎందుకు వచ్చాయో. సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసారు.

అడల్ట్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే చూపించారు. భార్య భర్తల ఎమోషన్ ని హీరో – హీరోయిన్ జంటతో బాగానే చూపించారు. అంగస్తంభన సమస్య ఉంటే డాక్టర్ తో కాదని సొంత వైద్యాలు చేసుకోవడం కామెడీకి బాగానే ఉంది కానీ దాన్ని సీరియస్ గా చూపించలేదు. ఇక ఈ సినిమాలో హీరోకి వేరే ఏదో సమస్య ఉన్నట్టు రిలీజ్ కి ముందు తప్పుడు ప్రమోషన్స్ చేయడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఇన్నాళ్లు సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్ మాగంటి హీరోగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తాగుబోతు, కోపం ఎక్కువ ఉండే పాత్రలో బాగా నటించాడు. గాయత్రీ రమణ క్యూట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ భార్య పాత్రలో అందర్నీ మెప్పిస్తుంది. ఇండస్ట్రీకి మంచి తెలుగు నటి దొరికింది. రాజ్ కుమార్ కసిరెడ్డి అక్కడక్కడా నవ్విస్తాడు. నెగిటివ్ పాత్రలో రాజేష్ బాగానే నటించాడు. సాయి కామాక్షి భాస్కర్ల కాసేపే కనిపించినా ఇంపార్టెంట్ పాత్రలో అదరగొట్టింది. మురళీధర్ గౌడ, పద్మ, సాయి ప్రసన్న.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Mrithyunjay : ‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ.. మొదటిసారి శ్రీవిష్ణు చేసిన థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక్క పాట బాగుంది. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, తండ్రి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కట్ చేస్తే బెటర్. కథేం లేకపోయినా సింపుల్ పాయింట్ తో కామెడీ, కొన్ని సంబంధం లేని ఎమోషనల్ సీన్స్ తో రాసుకున్నారు. దర్శకత్వపరంగా టేకింగ్ బాగుంది. నిర్మాణ పరంగా కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఉన్న సినిమా. ఓ సారి చూసేయొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.