Srirastu : శ్రీరస్తు ఫస్ట్ లుక్ రిలీజ్.. తెలుగు, కన్నడలో..
ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. (Srirastu)
- Saketh U
- Published on- September 13, 2026 / 07:58 PM IST
Srirastu
Srirastu : ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీరస్తు’. హరి క్రియేషన్స్ బ్యానర్ పై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మాణంలో శంకర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శక నిర్మాతలిద్దరికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాని ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కామెడీతో, ప్రేమకథతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ హీరో ప్రజ్వల దేవరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
Also See : Roopa Koduvayur : బ్లాక్ డ్రెస్ లో తెలుగమ్మాయి రూప.. అందమైన రూపంతో.. ఫొటోలు..
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా శ్రీరస్తు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ ఏడాదిలోని శ్రీరస్తు సినిమాని రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించారు.
