Rajendra Prasad : సీనియర్ ఆర్టిస్ట్ గా దండం పెట్టి చెప్తున్నా.. ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Rajendra Prasad)
Rajendra Prasad
Rajendra Prasad : రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా.. పలువురు ముఖ్య పాత్రల్లో ప్రేయసి రావే ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్స్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని సెప్టెంబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ.. చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. నిర్మాతల డైరెక్టర్. ఇలాంటి ఉత్తమ దర్శకుడు మరిన్ని సినిమాల్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. చైతన్య రెడ్డి గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నారు. నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. చంద్ర మహేష్ ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలి అని అన్నారు.
Also Read : Rashmika Mandanna : బేబీ బంప్ తో రష్మిక మందన్న.. రణబాలి సెట్స్ నుంచి.. ఫోటోలు వైరల్..
డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం నాకు దొరికిన మంచి పాత్రలు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దణ్ణంపెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి అని అన్నారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. పిఠాపురంలో… అలా మొదలైంది సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా పిఠాపురంలో… అలా మొదలైంది మరోస్థాయిలో ఉంటుంది అని అన్నారు. సినిమా రిలీజ్ చేస్తున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తండ్రీ, కూతుళ్ల మధ్య రిలేషన్‌ను అద్భుతంగా చూపించారు. అనుభవం ఉన్న వారు చెప్పే సలహాల్ని పిల్లలు పాటించాలి. చిన్న నిర్మాతలకు, కొత్త వారికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం అని అన్నారు.
Also Read : The Court Review : ‘ది కోర్ట్’ వెబ్ సిరీస్ రివ్యూ.. నత్తి ఉన్న అమ్మాయి లాయర్ అవుతుందా?
నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్, ఎఫ్.ఎం. మురళీ మాట్లాడుతూ.. ప్రతీ తల్లి, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా ఇది. నా ఊర్లో నేను ఎన్నో కుటుంబాల్ని చూసి ఈ కథను రాసుకున్నాను. చంద్ర మహేష్ గారికి ఈ కథను వినిపించాను. ఇప్పుడు నా కథ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అంటూ రాబోతోంది. ప్రతీ కుటుంబంలో జరిగే కథలా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా మా ఇంట్లో షూట్ చేశారు. సినిమా చూసి భావోద్వేగంతో బయటకు వచ్చాను అని అన్నారు.
