TTD: తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు.. కన్ఫ్యూజన్ లో భక్తులు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తుల ప్రయాణ సౌకర్యాలు, వాహనాల రాకపోకలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుండటంతో టీటీడీ(TTD) స్పందించింది.
TTD clarification on tirumala private vehicles ban rumours fake news warning
- ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు అవాస్తవం
- భక్తులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు
- పుకార్లు రేపితే కఠిన చర్యలు
TTD: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల ప్రయాణ సౌకర్యాలు, వాహనాల రాకపోకలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుండటంతో టీటీడీ (TTD)స్పందించింది. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారని, ప్రతిరోజూ కేవలం 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
Dancer Raju: ‘ఢీ’ షో విన్నర్ రాజుపై కేసు.. యువతిని మోసం, 12 లక్షలతో పరార్.. పోలీసు విచారణ వేగవంతం!
తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు.. చట్టపరమైన చర్యలు:
ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు విధించలేదని తెలిపిన టీటీడీ, భక్తులు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, తాజా సమాచారాన్ని కేవలం టిటిడి అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తులను అయోమయానికి గురిచేసేలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
