Salaar : సలార్ సినిమా KGFని మించి ఉంటుంది.. అదో కొత్త ప్రపంచం.. సలార్ పై శ్రియ రెడ్డి కామెంట్స్..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియారెడ్డి సలార్ సినిమా గురించి మాట్లాడి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేసింది. సలార్ సినిమాలో ఇప్పటికే ఆమె షూటింగ్ పూర్తయింది.

Sriya Reddy comments on Prabhas Salaar Movie

Sriya Reddy :  పొగరు సినిమాలో విలన్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రియారెడ్డి. విశాల్ కి వదినగా, తమిళ్ సినిమాల్లో నటిగా శ్రియారెడ్డి పరిచయం. ఆమె కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది శ్రియారెడ్డి. ప్రభాస్ సలార్, పవన్ కళ్యాణ్ OG సినిమాలలో ముఖ్యపాత్రలు చేస్తోంది. సలార్ సినిమాలో ఇప్పటికే ఆమె షూటింగ్ పూర్తయింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియారెడ్డి సలార్ సినిమా గురించి మాట్లాడి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేసింది. శ్రియారెడ్డి మాట్లాడుతూ.. సలార్ సినిమా కేజీఎఫ్ కు మించి ఉంటుంది. ప్రశాంత్ నీల్ ఒక ఆరా క్రియేట్ చేశాడు. అదొక కొత్త ప్రపంచం. గేమ్ అఫ్ థ్రోన్స్ రేంజ్ లో ఉంటుంది. అది ఇంకో ప్రపంచం, మన ప్రపంచంలాగా ఉండదు. ఆ ప్రపంచంలో ప్రభాస్ కింగ్. ప్రభాస్ గత సినిమాలతో అసలు ఈ సినిమాకు సంబంధం ఉండదు. సినిమాలో ప్రతి సెకన్, ప్రతి షాట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నాకు మొదటి రోజు ప్రభాస్, పృథ్విరాజ్ లతోనే సీన్, ఒక పేజీ డైలాగ్ ఉంది, చూసి షాక్ అయ్యాను అని తెలిపింది.

Bhaag Saale : సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్‌తో.. భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్.. వజ్రపు ఉంగరం చుట్టూ కథ??

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. చాలా మంచి వ్యక్తి. అందరూ చెప్పినట్టే చాలా సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారు. మాకు కూడా భోజనం స్పెషల్ గా తెప్పించి పెట్టారు అని తెలిపింది శ్రియారెడ్డి. దీంతో శ్రియ చేసిన వ్యాఖ్యలతో సలార్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు