Bhaag Saale : సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్‌తో.. భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్.. వజ్రపు ఉంగరం చుట్టూ కథ??

ది వరల్డ్ అఫ్ భాగ్ సాలే అంటూ నేడు ఓ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా కూడా హీరో సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఉంది.

Bhaag Saale : సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్‌తో.. భాగ్ సాలే ట్రైలర్ రిలీజ్.. వజ్రపు ఉంగరం చుట్టూ కథ??

Sri Simha Bhaag Saale Teaser released with Siddhu Jonnalagadda Voice

Updated On : June 21, 2023 / 12:21 PM IST

Sri Simha :  కీరవాణి(Keeravani) తనయుడు శ్రీ సింహ మత్తు వదలరా, తెల్లారితే గురువారం లాంటి సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులని మెప్పించాడు. త్వరలో భాగ్ సాలే(Bhaag Saale) సినిమాతో రాబోతున్నాడు. శ్రీ సింహ, నేహా సోలంకి(Neha Solanki) జంటగా ప్రణీత్ దర్శకత్వంలో బిగ్ బెన్ సినిమాస్ తో పాటు మరో రెండు నిర్మాణ సంస్థలు కలిసి భాగ్ సాలే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భాగ్ సాలే టీజర్ ని రిలీజ్ చేశారు.

ది వరల్డ్ అఫ్ భాగ్ సాలే అంటూ నేడు ఓ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా కూడా హీరో సిద్ధూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో ఉంది. స్వతంత్రం ముందు ఇండియాలో దొరికిన ఒక వజ్రం ప్రపంచం అంతా తిరిగి తిరిగి అందులో ఒక ముక్క నైజాం రాజుల దగ్గర ఉంగరంగా మారితే ఆ ఉంగరాన్ని కొట్టేసిన ఫ్యామిలీ అంటూ ఓ కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ.

Yash : యశ్ నెక్స్ట్ సినిమా ఆమె దర్శకత్వంలో? ఈసారి లవ్ స్టోరీతో..

ఈ టీజర్ చూస్తుంటే ఆ వజ్రపు ఉంగరం చుట్టూ తిరిగే కథ అయి ఉంటుందని, ఆ ఉంగరం హీరో దగ్గర ఉండొచ్చని తెలుస్తుంది. కామెడీ సస్పెన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ భాగ్ సాలే సినిమా జులై 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.