S. S. Rajamouli : రాజమౌళి కోరిక తీర్చకుండానే వెళ్ళిపోయిన సిరివెన్నెల
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు.
- kunduru Vinod
- Published On : November 30, 2021 / 09:33 PM IST
S. S. Rajamouli
S. S. Rajamouli : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని మ్యూజికల్ వీడియోలో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించా కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించ కుదర్లేదని తెలిపారు.
చదవండి : Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..
కుటుంబం ఆర్ధికంగా చితికిపోయి ఇంటి రెంటు కట్టలేని స్థితికి స్థాయికి పడిపోయిన సమయంలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సిరివెన్నెల గారు రాసిన పాట తనకు ఎంతో దైర్యం ఇచ్చిందని రాజమౌళి తెలిపారు.
— rajamouli ss (@ssrajamouli) November 30, 2021
