Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

తన సాహిత్యంతో తెలుగు సినిమా స్థాయిని, సినిమా పాట విలువని పెంచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిని వరించిన అవార్డులు..

Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

Sirivennela Awards

Sirivennela: తన సాహిత్యంతో తెలుగు సినిమా స్థాయిని, సినిమా పాట యొక్క విలువను పెంచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. ఆయన పాటల ప్రవాహం ఆగిపోయింది.. ఆయన కలం నుంచి నిర్విరామంగా జాలువారిన సాహిత్యానికి విరామం ఇస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సిరివెన్నెల. ఆయన కలానికి సలాం చేస్తూ.. ఎన్నో అవార్డులు ఆయన దరిచేరాయి. మొదటి పాటకే నంది అవార్డ్ సాధించిన సాహిత్య కారుడు బహుశా సీతారామ శాస్త్రి ఒక్కరేనేమో.. మొదటి సినిమాతో మొదలు పెట్టి తన పాటల పూదోట కోసం 11 రాష్ట్ర నందులను సాధించారు సీతారామ శాస్త్రి.

Sirivennela Sitaramasastri : ‘సిరివెన్నెల’ ఇకలేరు.. సినీ ప్రముఖుల సంతాపం

సిరివెన్నెల సీతారామ శాస్త్రి పదాలకు పదునెక్కువ.. మొదటి సినిమా ‘సిరివెన్నెల’తోనే తన టాలెంట్ ఏంటో చూపించి మెప్పించారు శాస్త్రి. మొదటి అవకాశంలోనే 9 పాటలు రాసిన సీతారామ శాస్త్రి.. మొదటి పాటకు నంది అవార్డ్‌ను కూడా సాధించారు. ‘విధాత తలపున’ అంటా సాగే ఆ గీతం.. ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. సిరివెన్నెలకు చిరకీర్తిని సంపాదించి పెట్టింది.

Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

సీతారామ శాస్త్రి కెరీర్‌లో రెండవ నంది అందుకున్నది కూడా విశ్వనాథ్ సినిమాకే.. ‘శృతి లయలు’ సినిమాలో ‘తెలవారదేమో స్వామి’ అంటూ.. స్వామికి విన్నపాలు చేసుకున్నారు సిరివెన్నెల. కలల అజడికి.. నిద్దుర కరువై.. అలసిన దేవేరి.. అలమేలు మంగకు అంటూ సీతారామ శాస్త్రి సాహిత్యానికి.. జేసుదాసు గళం తోడై.. పాట పరవళ్లు తొక్కింది. జన హృదయాలను గెలిచింది.

Sirivennela Wife

 

అందెల రవమికి.. పదములతో పాటు.. అమృత గానం తోడైతే ఎలా ఉంటుంది..? అది అలౌకిక ఆనందానికి తీసుకెళ్తుంది. ఇలా అంబరమంటిన పదములను ‘స్వర్ణ కమలం’ సినిమా కోసం సమకూర్చారు సీతారామ శాస్త్రి. ఈ పాట.. సినిమాకే పెద్ద ఎసెట్‌గా నిలిచింది. 1988లో రిలీజ్ అయిన ‘స్వర్ణకమలం’ సినిమాలో ఈ పాటకు మూడో నంది సీతారామ శాస్త్రి సొంతమయ్యింది.

Sirivennela : సిరివెన్నెల మరణం.. విశ్వనాథ్ భావోద్వేగం..

సీతారామ శాస్త్రి అంటే శాస్త్రీయం కలిసిన సాహిత్యం మాత్రమే కాదు.. సాంఘికం, జానపధం కూడా అని ఎన్నో సందర్భాలలో నిరూపించారాయన. ముఖ్యంగా ఆయన అందుకున్న నాలుగవ నంది.. సమాజంలో జరుగుతున్న అన్యాయలపై రాసిన పాటకే. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘గాయం’ సినిమాలో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకు’ అనే పాట.. సమాజంపై ఎంతోప్రభావం చూపింది. సిరివెన్నెల కీర్తిని ఓ మెట్టు ఎక్కించింది.

Sirivennela Family : సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే..

సిరివెన్నల రాసిన పాటలో ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. జీవిత సత్యాలను సాహిత్యానికి అనువయించి.. సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు తన సాహిత్యంలో పలికించారు సిరివెన్నెల. ‘శుభలగ్నం’లో ‘చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడకా’ అంటూ.. సిరివెన్నెల రాసిన పాట.. బాలు కంఠంలో ఇమిడి సాహిత్య అభిమానుల హృదయాలను తాకింది..వారిచేత కంటతడి పెట్టించింది.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల మృతికి గల కారణాలు వివరించిన కిమ్స్‌ ఎండీ డా.భాస్కర్ రావు

1996లో సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఆరవ సారి నంది వరించింది. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘శ్రీకారం’ సినిమాలో మనసు కాస్త కలతపడితే పాటకు ఆయన అందించిన అద్భుతమైన సాహిత్యం ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. బాధపడే మనసుకు ఓదార్పునిచ్చే మనిషి తోడుంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు అంటూ.. సిరివెన్నెల సహజమైన పదజాలంతో అద్భుతంగా వివరించారు.

Sirivennela : సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే..

‘సింధూరం’ సినిమా 1997లో రిలీజ్ అయ్యి ఓ సంచలనంగా మారింది. ఈ సినిమాలో సిరివెన్నెల రాసిన పాటలు ప్రతీ పౌరుడి రక్తాన్ని మరిగించాయి. ముఖ్యంగా ‘అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్య్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా’.. అంటూ.. నిజంగా మనకు స్వతంత్య్రం వచ్చిందా..? ఉత్సవాలు చేసుకునేంత మంచి జరిగిందా..? అంటూ ప్రతీ మనిషిలోని అజ్ఞానాన్ని తన పదాల పదును కత్తులతో కడిగిపడేశారు సీతారాముడు.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చిన పాట ఇదే..!

సిరివెన్నెల సాహిత్యం నుంచి శాస్త్రీయ గీతాలు.. ఉద్యమగీతాలతో పాటు ప్రణయ.. ప్రేమ కావ్యాలు కూడా జాలువారాయి. ఆయన పాటలలో ప్రేమ పదాలకు యువత మురిసిపోయేవారు.. కలలలో తేలిపోయేవారు. ‘దేవుడు కరుణిస్తాడని..వరములు కురిపిస్తాడని..నమ్మలేదు నాకు నీప్రేమే దొరికేవరకు’.. అంటూ ‘ప్రేమకథ’ సినిమా కోసం సిరివెన్నెల రాసిన పాట. రాతి హృదయంలో కూడా ప్రేమను చిగురింపచేసింది. ఈ పాట సిరివెన్నెల పాటల పూదోటకు 8వ నందిని సమకూర్చింది.

Sirivennela Padmashri

 

మనిషి ఒంటరిగా మారితే ఎటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒంటరి మనిషి జగమంతా తన కుటుంబంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అనేది.. ఒక పాటతో ప్రపంచానికి చాటారు శాస్త్రి. ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’ అంటూ ‘చక్రం’ సినిమాలో అద్భుత సాహిత్యంతో.. జీవిత సత్యాన్ని సింపుల్‌గా చెప్పేశారు సిరివెన్నెల. ఆయనకు ఎన్ని అవార్డ్‌లు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఈ పాటకు 9వ నంది ఆయణ్ణు వరించింది.

Sirivennela : సీతారామశాస్త్రి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.. త్రివిక్రమ్ హిస్టారికల్ స్పీచ్..!

మనిషి జీవింత పూర్తి చేయలేని పుస్తకం.. గమ్యం లేని ప్రయాణం.. ఇటువంటి జీవిత సత్యాన్ని ఈతరానికి అద్భుతంగా వివరించిన సినిమా ‘గమ్యం’. ఈ సినిమాలో సీతారాముడు రాసిన ‘ఎంత వరకూ.. ఎందుకొరకు’ పాట ఈ సత్యాన్నే వివరిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎలా పుట్టింది.. ఎలా చిగురు వేసింది.. అది బలంగా ఎలా మారింది..? ఈ విషయాలను చక్కగా వివరించారు సిరివెన్నెల.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల రాసిన నిప్పుకణికలాంటి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకోండి

సీతారామ శాస్త్రి చివరిసారిగా నంది అవార్డ్‌ను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా టైటిల్ సాంగ్‌కు అందుకున్నారు. ఒక కుటుంబంలో అది కూడా మధ్యతరగతి కుటుంలో అనుబంధాలు.. ఆత్మీయతలు. కలిసి చేసుకునే పనులు.. బంధాలకు ముడు వేసి కలుపుకుంటూ పోయే బంధువులు. చిన్న చిన్న గొడవలు.. పుల్లవిరుపు మాటలు.. ఇలా ఒకటేమిటి.. కుటుంబ చిత్రాన్ని ఒక పాటలో అద్భుతంగా వివరించారు సిరివెన్నెల. తన జీవితంలో చివరి నంది.. 11వ నంది అవార్డ్‌ను ఈ పాటకు అందుకున్నారాయన. వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు.. కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.

దివికేగిన ‘సిరివెన్నెల’ ప్రస్థానం

సిరివెన్నెల మన మధ్య లేకపోవచ్చు.. కానీ ఆయన అన్ని విషయాలను తన పాటల ద్వారా.. తన రచనల ద్వారా.. తన సాహిత్యం ద్వారా భావితరాలకు అందించే వెళ్లారు. ప్రతీ అక్షరంలో జీవిత సత్యాన్ని బోధించే వెళ్ళారు. పాటలు ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు.. మంచిని బోధించడానికి.. మన సంసృతిని కాపాడుకోవడానికి అని నిరూపించిన అక్షర జ్ఞానికి 10 టీవీ నివాళులర్పిస్తోంది.

Sirivennela : ఈ పాట తెలుగు సినీ సాహిత్యంపై సిరివెన్నెల దిద్దిన ‘సింధూరం’