Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

దర్శకుడు కె.విశ్వనాధ్ అన్ని సినిమాలకు ‘సిరివెన్నెల’ పనిచేశారు.. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు..

Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

Sirivennela

Sirivennela Sitarama Sastri: తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Sirivennela Sitaramasastri : ‘సిరివెన్నెల’ ఇకలేరు..

తెలుగు పాటలతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ సిరివెన్నెల సుపరిచితులే. ఈ సందర్భంగా వారి పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి స్వగ్రామం.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల రాసిన నిప్పుకణికలాంటి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకోండి

విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన సిరివెన్నెల మొదట్లో భరణి పేరుతో కవితలు రాసేవారు. గంగావతరణం కవిత చూసి ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసే అవకాశమిచ్చారు దర్శకుడు కె.విశ్వనాథ్. బాలకృష్ణ హీరోగా, విశ్వనాథ్ తెరకెక్కించిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో ‘సిరివెన్నెల’ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు.‘సిరివెన్నెల’ సినిమాకు అద్భుతమైన పాటలు రాసి ఆ సినిమా విజయంలో కీలక భాగమయ్యారు. దాంతో సీతారామ శాస్త్రి పేరు కాస్తా ‘సిరివెన్నెల’ గా మారిపోయింది.

అప్పటినుండి అదే సినిమా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.. ‘సిరివెన్నెల’ సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్నారు సీతారామ శాస్త్రి.. దర్శకుడు కె.విశ్వనాధ్ అన్ని సినిమాలకు ఆయన పనిచేశారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు.