Sirivennela : సిరివెన్నెల మరణం.. విశ్వనాథ్ భావోద్వేగం..

తనకు ఆత్యంత ఆప్తుడు, శ్రేయోభిలాషి సిరివెన్నెల మరణవార్త తెలియగానే కళాతపస్వి కె.విశ్వనాథ్..

Sirivennela : సిరివెన్నెల మరణం.. విశ్వనాథ్ భావోద్వేగం..

K Viswanath

Sirivennela: తన పదాలతో తెలుగు సాహిత్యానికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చి.. తన పద ప్రయోగంతో తెలుగు సినిమా పాటలకు సరికొత్త అర్థాన్ని చెప్పిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు అనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..

ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమ, శ్రేయోభిలాషులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, సిరివెన్నెలది విడదీయరాని బంధం.. దశాబ్దాలుగా సాగుతున్న సినీ సంబంధం. సిరివెన్నెలను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది విశ్వనాథే. సిరివెన్నెల మరణంతో భావోద్వేగానికి గురయ్యారు విశ్వనాథ్.

Sirivennela : సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే..

‘ఇది నమ్మలేని నిజం.. నిజంగా జరిగినా నమ్మలేకుండా ఉన్నాం.. ఇది చాలా పెద్ద లాస్ నాకు.. బాల సుబ్రహ్మణ్యం పోయినప్పుడు కుడి భుజం రాలిపోయిందనుకున్నాను. ఇప్పుడు సిరివెన్నెల పోయిన తర్వాత ఎడమ భుజం కూడా పోయింది. అంత సన్నిహితంగా ఉండి, అంత చక్కగా మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా అంతర్థానమైపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. వాళ్ల కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు విశ్వనాథ్.

Sirivennela : సీతారామశాస్త్రి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.. త్రివిక్రమ్ హిస్టారికల్ స్పీచ్..!