SSMB 28 : ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలు.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..
ఆగస్టులో SSMB28 సినిమా షూటింగ్ మొదలుపెడతామని ప్రకటించారు చిత్రయూనిట్. ఆగస్టు అయిపోయినా కూడా మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలవ్వలేదు. దీంతో మహేష్ అభిమానులు................

SSMB28 Movie shooting stars and shoot pic goes viral
SSMB 28 : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. అతడు సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినా, ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు నిర్వహించినా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. సినిమాని అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, సమ్మర్ కి రిలీజ్ అని చెప్పినా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు చిత్ర యూనిట్.
ఆగస్టులో SSMB28 సినిమా షూటింగ్ మొదలుపెడతామని ప్రకటించారు చిత్రయూనిట్. ఆగస్టు అయిపోయినా కూడా మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలవ్వలేదు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొదలుపెట్టి అందర్నీ సర్‌ప్రయిజ్ చేశారు చిత్రయూనిట్. నేడు సోమవారం SSMB28 సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు.
Soundarya Rajinikanth : మరో బాబుకి జన్మనిచ్చిన రజినీకాంత్ కూతురు..
సినిమా సెట్ లో మహేష్ కి త్రివిక్రమ్ సీన్ గురించి వివరిస్తున్న ఓ ఫోటోని షేర్ చేసి SSMB28 సినిమా షూటింగ్ మొదలయింది అని చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. 2023 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. సినిమా షూటింగ్ మొదలైందని తెలియగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.