Health Tips: రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేయండి.. ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా?
మనిషి ఆరోగ్యం విషయంలో రాత్రి భోజనం చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ, ఈ రోజుల్లో జీవనశైలి మారడం వల్ల రాత్రి భోజనం(Health Tips) చాలా మంది ఆలస్యంగా చేస్తున్నారు.

Some health tips that provide physical and mental health
Health Tips: మనిషి ఆరోగ్యం విషయంలో రాత్రి భోజనం చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ, ఈ రోజుల్లో జీవనశైలి మారడం వల్ల రాత్రి భోజనం చాలా మంది ఆలస్యంగా చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా తినడం వల్ల అనేకరకాల సమస్యలు వస్తాయట. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే రాత్రి భోజనాన్ని 8 గంటల లోపు పూర్తిచేయడం వల్ల శరీరానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలుకలుగుతుందట. ఈ చిన్న మార్పు దీర్ఘకాలంలో శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. మరి రాత్రి భోజనం 8 గంటల లోపు చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల(Health Tips) గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్.. రోజూ తింటే దెబ్బకు పొట్ట ఫ్లాట్ గా తయారవుతుంది
1.జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
రాత్రి భోజనం త్వరగా పూర్తిచేయడం వల్ల జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి దొరుకుతుంది. ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహారం సరిగ్గా జీర్ణమై శరీరానికి శక్తి సరిగా అందుతుంది. ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.
2.బరువు నియంత్రణ/తగ్గుదల:
అలసిన శరీరానికి ఆలస్యంగా ఆహారం అందిస్తే అది కొవ్వుగా మారె ప్రమాదం ఉంది. కాబట్టి, రాత్రిపూట తొందరగా తింటే ఎక్కువ సేపు పొట్ట ఖాళీగా ఉండటం వల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లా పని చేస్తుంది. దీనివల్ల చెడు కొవ్వు (bad fat) తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. మెటబాలిజం వేగంగా పని చేస్తుంది.
3.మధుమేహం (షుగర్) నియంత్రణలో ఉంటుంది:
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి, భోజనాన్ని ముందుగా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
4.నిద్ర నాణ్యత పెరుగుతుంది:
రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకుంటే నిద్ర సమస్యలు రావచ్చు. కాబట్టి, కొద్దిగా త్వరగా తినడం వల్ల పొట్ట ఖాళీగా ఉంటుంది నిద్రకు ఆటంకం కలగదు. మెదడుకు విశ్రాంతి కలుగుతుంది. ఉదయం ఉత్సాహంగా లేచే అవకాశం ఉంటుంది.
5.గుండె ఆరోగ్యం మెరుగవుతుంది:
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, ముందుగానే భోజనం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి.