Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్.. రోజూ తింటే దెబ్బకు పొట్ట ఫ్లాట్ గా తయారవుతుంది
Belly Fat: పొట్ట భాగంలో పెరిగే ఫ్యాట్ ను తాగించుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్, యోగా, మెడిటేషన్ ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

5 types of foods that reduce belly fat
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో బెల్లీ ఫ్యాట్ (పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు) ఒకటి. ఇది శరీర ఆకృతిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయి కొవ్వు వల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, పొట్ట భాగంలో పెరిగే ఫ్యాట్ ను తాగించుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్, యోగా, మెడిటేషన్ ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు మనం తీసుకునే ఆహారం వల్ల కూడా పొట్టను తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఆహారం ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.అవోకాడో (Avocado):
అవోకాడోలో హెల్తీ ఫ్యాట్స్ (Monounsaturated fats) అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట భాగంలోని కొవ్వును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన భోజనం తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
2.గ్రీన్ టీ (Green Tea):
గ్రీన్ టీ లో ఉండే కేట్‌చిన్స్ (Catechins) అనే యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. ఇది శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి, రోజుకి 2 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
3.ఆకుకూరలు:
ఆకుకూరల్లో లో కేలరీలు, హై ఫైబర్ ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని వేపుడు, పచ్చడి, సూప్, చాపతి తో పాటు తీసుకుంటే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
4.ఓట్స్ (Oats):
ఓట్స్‌లో బెటా గ్లూకాన్ (Beta-glucan) అనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్టరాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, దీనిని తినడం వల్ల పొట్టనిండిన భావన కలిగి ఆకలి త్వరగా వేయదు. కాబట్టి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు ఓట్స్ పొరిడ్జ్ లేదా పాలతో కలిపి తినవచ్చు.
5.కందులు, శెనగలు:
వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ కలయిక వల్ల కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను శక్తివంతంగా ఉంచి, పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి.
బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు అదనపు సూచనలు:
- నీరు: రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు పోతాయి
- నిద్ర: రాత్రి 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి, లేదంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
- వ్యాయామం: ప్రతి రోజు 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం మంచిది
- ప్రాసెస్డ్ ఫుడ్, బెల్లం, చక్కెర: వీటిని పూర్తిగా తగ్గించండి మంచిది.