Diabetes: డయాబెటీస్ పేషేంట్స్ మీకోసమే.. పవర్ ఫుల్ ఎనర్జీ డ్రింక్.. రోజూ తాగితే షుగర్ మొత్తం మాయం
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిల(Diabetes)ను నియంత్రించలేకపోవడం వల్ల

Fenugreek-cinnamon detox drink that controls diabetes
Diabetes: మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని నియంత్రించేందుకు కేవలం మందులతో కాదు.. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన పానీయాల తీసుకోవడం చాలా అవసరం. అందులోను ఆరోగ్యకరమైన పానీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే ఇక్కడ మధుమేహం(Diabetes) ఉన్నవారు కూడా సురక్షితంగా తీసుకునే శక్తినిచ్చే, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే ఒక సహజమైన ఎనర్జీ డ్రింక్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆ డ్రింక్ పేరు “మెంతి-దాల్చిన చెక్క డిటాక్స్ డ్రింక్”:
ఈ డ్రింక్ ని తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇందులో వాడే పదార్థాలు కూడా సహజమైనవి, శక్తినిచ్చేవి, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే గుణాలు కలిగి ఉంటాయి.
Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా.. అయితే ఈ గింజలు రోజూ తినండి.. పుష్కలంగా పెరుగుతుంది
ఈ పానీయం తయారీకి కావలసిన పదార్థాలు:
- మెంతి గింజలు: 1 టీస్పూన్(ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది)
- దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క / ½ టీస్పూన్ పొడి(గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది)
- అల్లం: ½ టీస్పూన్ తురిమినది(వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది)
- నీరు: 2 గ్లాసులు(హైడ్రేషన్‌కు అవసరం)
- నిమ్మరసం: 1 టీస్పూన్ (డిటాక్స్ గుణం)
తయారీ విధానం:
ఒక పాత్రలో 2 గ్లాసుల నీరు తీసుకుని, మెంతి గింజలు, దాల్చిన చెక్క, అల్లం వేసి మరిగించాలి. అలా 5 నుంచి 7 నిమిషాలపాటు మరిగించాలి. తరువాత వాటిని వడకట్టి తీసి వేడి తగ్గాక నిమ్మరసం కలిపి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ డ్రింక్ వల్ల కలిగే లాభాలు:
1.గ్లూకోజ్ నియంత్రణ:
మెంతిలో ఉండే గలాక్టోమనాన్ ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
2.ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది:
దాల్చిన చెక్క శారీరాన్ని ఇన్సులిన్ మెరుగుగా వినియోగించేలా చేస్తుంది.
3 శక్తినిచ్చే గుణం:
ఈ డ్రింక్ శరీరాన్ని హైడ్రేట్ చేయడంతోపాటు తక్షణ శక్తిని ఇస్తుంది. మధుమేహులలో తరచూ కనిపించే అలసటను తగ్గిస్తుంది.
4.జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది:
అల్లం, మెంతి గింజలు జీర్ణశక్తిని పెంచి మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తాయి.
5.బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
Health Tips: మీ పిలల్లకు తేనే తినిపిస్తున్నారా? చేతులు, కాళ్ళు పడిపోవచ్చు.. జాగ్రత్త సుమీ
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- షుగర్ మందులు లేదా ఇన్సులిన్ తీసుకునే వారు, ఈ డ్రింక్ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
- గర్భిణులు, డెలివరీ అయినా వాళ్ళు వైద్య సలహాతో మాత్రమే ఉపయోగించాలి.
- ఈ పానీయం ప్రయోజనకరంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వ్యాయామం కూడా అవసరం.