SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం SSMB28 ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కోసం రెడీ అయ్యింది. అయితే ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ ఇదిగో, అదిగో అంటూ చిత్ర యూనిట్ జరుపుకుంటూ వస్తున్నారు. దీంతో ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu : SSMB28 చిత్ర యూనిట్‌కి ఇంటి వంట రుచి చూపిస్తున్న నమ్రతా..
అయితే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను డిసెంబర్ 15న ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ అవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
SSMB28: మహేష్ బాబు సినిమా అందుకే ఆలస్యం అవుతుందా..?
మహేష్ బాబు నటిస్తున్న సినిమా రెండో షెడ్యూల్ జనవరి నెలలో ప్రారంభమవుతుందని.. ఇది నాన్-స్టాప్‌గా సాగనుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సంద్భంగా మహేష్‌తో కలిసి ఆయన దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్తతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఈ సినిమా రెండో షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
We’re all set!! Long awaited #SSMB28 regular shoot will start from January, non-stop. Get ready to witness a blockbuster entertainer in theatres! ??
SUPERSTAR @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman #PSVinod #ASPrakash @NavinNooli @haarikahassine pic.twitter.com/q6DZMwowvh
— Naga Vamsi (@vamsi84) December 10, 2022