Star Actor : ఒకప్పటి స్టార్ హీరో రీసెంట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేంటి ఇలా అయిపోయాడు, సినిమా కోసం ఇలా మారాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?(Star Actor)
ఈ ఫొటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో కాదు ఒకప్పటి ఫ్యామిలీ హీరో, ప్రస్తుత స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న జగపతి బాబు. రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం జగపతి బాబు ఇలా మారిపోయాడు. ఈ సినిమాలో జగపతి బాబు సరికొత్త లుక్ లో, సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం జగపతి బాబు ఇలా బక్కచిక్కి ముసలి పాత్రలోకి మారారు.
Also Read : Hey Bhagawan : సుహాస్ ‘హే భగవాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఇంతకీ ఏం బిజినెస్ బాబు..
జగపతి బాబు పెద్ది సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవల ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. నేడు జగపతి బాబు పుట్టిన రోజు కావడంతో సినిమా సెట్లో బుచ్చిబాబుతో మాట్లాడుతున్న ఫోటో రిలీజ్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది జగపతి బాబేనా అని సందేహిస్తున్నారు. ఏ వైపు నుంచి చూసినా జగపతిబాబులా అనిపించట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి పెద్ది సినిమా కోసం జగపతి బాబు బాగానే కష్టపడి కొత్త లుక్ లోకి మారాడు. సినిమాలో జగపతి బాబు పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ జగపతి బాబు – రామ్ చరణ్ కలిసి రంగస్థలంలో నటించి అదరగొట్టారు. మరోసారి ఈ ఇద్దరి కాంబో పెద్ది సినిమాలో ఉండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.
Also Read : Salman Khan : ఏకంగా సల్మాన్ ఖాన్ బామ్మర్దికే ధమ్కీ ఇచ్చిన గ్యాంగ్.. భయం గుప్పిట్లో బాలీవుడ్..