×
Ad

Star Heroine : స్టార్ హీరోయిన్.. మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే.. టాలీవుడ్ కి దూరమయిందట..

ఈ హీరోయిన్ కావాలనే కొంతకాలం టాలీవుడ్ కి దూరంగా ఉండాలి అనుకుందట. అది కూడా మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయినందుకు. (Star Heroine)

Star Heroine

Star Heroine : చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత టాలీవుడ్ ని మర్చిపోతారు. అలాంటి హీరోయిన్స్ లో ఈ స్టార్ హీరోయిన్ కూడా ఒకరు. అయితే ఈ హీరోయిన్ కావాలనే కొంతకాలం టాలీవుడ్ కి దూరంగా ఉండాలి అనుకుందట. అది కూడా మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయినందుకు. దీంతో ఈ భామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.(Star Heroine)

ఇంతకీ ఆ మాటలు అన్నది ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, బ్రూస్లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, జయజనకి నాయక.. ఇలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే మహేష్ బాబు తో స్పైడర్ సినిమాలో నటించగా ఆ సినిమా భారీ పరాజయం పాలయింది.

Also See : NBK 111 Movie Opening : గ్రాండ్ ఓపెనింగ్.. బాలయ్య – నయనతార కొత్త సినిమా.. NBK 111 ఫొటోలు..

స్పైడర్ సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అంచనాలు తప్పి ఫెయిల్ అయింది. ఆ సినిమా తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు తప్ప మళ్ళీ యాక్టివ్ గా లేదు రకుల్. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అక్కడే సినిమాలు చేస్తూ అక్కడి నిర్మాతని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపొయింది.

తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాకుల్ ప్రీత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. టాలీవుడ్ లో నాకు వరుసగా ఎనిమిది, తొమ్మిది సినిమాలు హిట్స్ వచ్చాయి. స్పైడర్ సినిమా నా కెరీర్‌లో మొదటి పెద్ద డిజాస్టర్. మన అంచనాలు దెబ్బ తింటే ఎలా ఉంటుందో అప్పుడు నాకు అర్ధమయింది. ఆ ఒత్తిడిని నేను మానసికంగా ఫేస్ చేయలేకపోయాను. నాకు అది భారంగా అనిపించింది. దాని నుంచి రికవరీ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన నెగిటివ్ ఎనర్జీ, సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటి నన్ను బాగా దెబ్బతీశాయి. అందుకే కొంతకాలం టాలీవుడ్ కి దూరంగా ఉండాలి అనుకున్నాను అని తెలిపింది.

Also See : Anasuya Renu Desai : కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన అనసూయ, రేణు దేశాయ్.. ఫొటోలు..

దీంతో రకుల్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మహేష్ సినిమాని ప్రత్యేకంగా చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ లో సెటిల్ అయిన రకుల్ మళ్ళీ టాలీవుడ్ కి వస్తుందా అనేది అనుమానమే.