Street Fighter trailer : స్ట్రీట్ ఫైటర్ ట్రైలర్ వ‌చ్చేసింది..

స్ట్రీట్ ఫైటర్ ట్రైలర్‌ను (Street Fighter trailer) విడుద‌ల చేశారు.

Street Fighter trailer out now

Street Fighter trailer : జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ కీలక పాత్రల్లో న‌టిస్తున్న మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ . కిటావో సకురాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబ‌ర్ 16న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తో పాటు భార‌తదేశంలో హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

ఈ చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Shiva Jyothi : పింక్ శారీ, భారీ హారంతో యాంక‌ర్ శివ‌జ్యోతి.. ఫోటోలు వైర‌ల్‌..

 

నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది