OG Universe : పవన్ బర్త్ డే.. ఓజీ యూనివర్స్ నుంచి స్పెషల్ వీడియో..
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ యూనివర్స్ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
Pawan Kalyan birthday special video from OG universe Azad Hind Fauj to contemporary times
OG Universe : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ చిత్రానికి ఓజీ యూనివర్స్ కూడా ప్రకటించి ప్రీక్వెల్స్, సీక్వెల్స్ ఉంటాయని వెల్లడించారు కూడా. దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఓజీ 2 చిత్ర పనుల్లో నిమగ్నం అయ్యాడు. ఇక నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఇందులో పవన్, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ కలిసి ఓజీ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కథ కేవలం ప్రస్తుత కాలానికి పరిమితం కాదని వెల్లడించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కాలం నుంచి నేటి వరకు జరిగిన పలు కీలక సంఘటనల నేపథ్యాన్ని తీసుకుని ‘OG Universe’ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
Anu sreeraj : బొమ్మరిల్లు సీరియల్ నటి అను శ్రీరాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు..
From the #OGUniverse
To the #OG…ALL LOVE for everything so far…
And everything that begins from here 🙂 🧿🧿♥️♥️Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
