స్టైలిష్ లుక్‌లో బాలయ్య!

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‘రూలర్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు..

  • Publish Date - November 9, 2019 / 09:44 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న‘రూలర్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు..

నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రూలర్’.. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ‘రూలర్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు..

బాలయ్య స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు.. బాలయ్య మేకోవర్, కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని యంగ్ లుక్ బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘యంగ్ బాలయ్య, ఎనర్జిటిక్ బాలయ్య, ఎవర్‌గ్రీన్ బాలయ్య’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడిమాలో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు..

Read Also : అశోక్ గల్లా సినిమాకు అతిథిగా రామ్ చరణ్

తర్వలో టీజర్ విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘రూలర్’ రిలీజ్ కానుంది. సోనాల్‌చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : చిరంతన్ భట్, కెమెరా : సి.రామ్ ప్రసాద్