Mahesh – Rajamouli : రాజమౌళి సినిమా కోసం మహేష్ ఫిజికల్‌గా.. ఫుడ్ విషయంలో.. సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చాలా ఛేంజ్ అవుతున్నాడని ఇటీవల మహేష్ ని చూస్తేనే తెలుస్తుంది.

Mahesh – Rajamouli : మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని సమాచారం. ఇక రాజమౌళి మహేష్ తో దుబాయ్ లో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ చేస్తున్నారని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల మహేష్ కొంచెం బాడీ పెంచి, జుట్టు పెంచి కనపడగా మహేష్, ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చాలా ఛేంజ్ అవుతున్నాడని ఇటీవల మహేష్ ని చూస్తేనే తెలుస్తుంది. తాజాగా హీరో, మహేష్ బావ సుధీర్ బాబు(Sudheer Babu) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నాడో తెలిపాడు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు మెంటల్ గా, ఫిజికల్ గా చాలా ఛేంజ్ అవుతున్నాడు. తన బెస్ట్ ఇస్తున్నాడు. నేను మహేష్ ని ఇలా అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మహేష్ ఫుడ్ విషయంలో చాలా క్యాలుక్యులేట్ చేసుకొని డైట్ చేస్తూ తింటాడు. కాని ఇప్పుడు అన్ని తింటున్నాడు. ఒక బల్క్ బాయ్ లా తయారవ్వడానికి ఫోకస్ చేస్తున్నాడు అని తెలిపాడు.

Also Read : Movie Theaters : ఇకపై బెనిఫిట్ షోలు ప్రదర్శించం.. షాక్ ఇచ్చిన తెలంగాణ థియేటర్స్.. నిర్మాతలు అలా చేయకపోతే..

దీంతో సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే మహేష్ డైట్ చాలా పక్కాగా ఫాలో అవుతాడు. అలాంటిది రాజమౌళి సినిమా కోసం బాడీ పెంచడానికి తన డైట్ పక్కన పెట్టేసి అన్నీ తింటున్నాడని, చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ని కొత్త అవతారంలో చూడొచ్చు అని సంతోషిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండానే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు