Sudher Babu : ‘మా నాన్న సూపర్ హీరో’.. క్లాస్ లుక్ లో స్కూటర్ పై సుధీర్ బాబు..

సుధీర్ బాబు హీరోగా ఇటీవల 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Updated on- September 9, 2024 / 11:08 AM IST

Sudheer Babu Ma Nanna Super Hero Movie First Look Released

Sudher Babu : ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే హరోంహర అనే యాక్షన్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు సుధీర్ బాబు. ఈ సినిమాతో తన పేరు ముందు నవ దళపతి అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. అలాంటి యాక్షన్ సినిమా తర్వాత ఇప్పుడు మరో క్లాస్ సినిమాతో రాబోతున్నాడు.

Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్‌లో రంగు పడింది.. అప్పుడే రెండో వారం నామినేషన్లు మొదలు..

సుధీర్ బాబు హీరోగా ఇటీవల ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో సుధీర్ బాబు స్కూటర్ మీద వెళ్తూ ఎదురుగా వస్తున్న పిల్లలకు హాయ్ చెప్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే పీరియాడిక్ సినిమా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తారని, దసరాకు ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకరటించారు మూవీ యూనిట్.

మా నాన్న సూపర్ హీరో సినిమాని V సెల్యులాయిడ్, క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అభిలాష్ కంకర తెరకెక్కిస్తున్నాడు.