G.O.A.T Glimpse : మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి.. తరువాత నేనే అంటున్న సుడిగాలి సుధీర్.. గోట్ గ్లింప్స్ అదుర్స్..

సుడిగాలి సుధీర్ తన కొత్త సినిమా G.O.A.T గ్లింప్స్ రిలీజ్ చేశాడు. మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళి తరువాత..

Sudigali Sudheer Divya Bharathi GOAT movie Glimpse released

G.O.A.T Glimpse : సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా తన 4వ సినిమాని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ చిత్రానికి G.O.A.T అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఖరారు చేయగా.. దానికి ‘Greatest Of All Times’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. విశ్వక్ సేన్ తో ‘పాగల్’ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ మూవీ ‘బ్యాచిలర్’తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దివ్య భారతి (Divya Bharathi) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

Vijay Deverakonda : ఖుషి ప్రమోషన్స్‌లో రష్మిక గురించి విజయ్ ఇంటరెస్టింగ్ కామెంట్స్.. తనతో కలిసి..!

తాజాగా ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో సుధీర్.. లుంగీ కట్టులో గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని, సిగరెట్ వెలిగిస్తూ పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పాడు. “ఎవడరా నన్ను Fluke అన్నది” అని డైలాగ్ చెప్పాడు. Fluke అంటే ‘లక్ కలిసి వచ్చి ఒక వ్యక్తికి విజయమే ఎదురవ్వడం’ అని అర్ధం. ఇక సుధీర్ ఈ డైలాగ్ చెప్పగానే టైటిల్ పడుతుంది. ఆ టైటిల్‌లో.. “మెస్సీ రొనాల్డో, కోహ్లీ, రాజమౌళితో పాటు సుధీర్ ఫోటో వేసి వాళ్ళలా తాను కష్టపడి పైకి వచ్చాను” అని సుధీర్ ఇన్‌డైరెక్ట్ చెప్పినట్లు ఉంది. అయితే గ్లింప్స్ మాత్రం బాగుంది.

Bigg Boss 7 : బిగ్‍బాస్ 7 డేట్ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే షురూ.. గెట్ రెడీ

చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ కలిసి లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లియో ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. గ్లింప్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ కూడా సినిమాకు తగ్గట్టే బాగా ఇస్తున్నట్లు ఇటీవల దర్శకుడు తెలియజేశాడు. శరవేగంగా ఈ సినిమాని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ షూటింగ్ ని జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు