Sarkaar Season 4 : సర్కార్ సీజన్ 4 ప్రోమో చూశారా.. కమ్‌బ్యాక్‌తో నవ్వుల సుడిగాలి సృష్టిస్తున్న సుధీర్..

సర్కార్ సీజన్ 4 ప్రోమో చూశారా. బుల్లితెర హీరో సుధీర్ తన కమ్‌బ్యాక్‌తో నవ్వుల సుడిగాలి సృష్టిస్తున్నాడు.

Sarkaar Season 4 : తెలుగు ఓటీటీ ఆహా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి అలరిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ‘సర్కార్ గేమ్ షో’ ఒకటి. ప్రదీప్ హోస్టుగా మూడు సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ గేమ్ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ మొదలు పెట్టుకోబోతుంది. ఇక ఈ సీజన్ కోసం సుడిగాలి సుధీర్ ని తీసుకువచ్చారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సుధీర్ బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చారు.

దీంతో బుల్లితెర పై సుధీర్ ని ప్రేక్షకులంతా మిస్ అయ్యారు. అంతేకాదు సుధీర్ మళ్ళీ బుల్లితెర పై ఎప్పుడు కనిపిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఇక ఆ ఎదురు చూపులను గమనించిన ఆహా టీం.. సుధీర్ ని సర్కార్ గేమ్ షోతో మళ్ళీ బుల్లితెర ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సీజన్ 4 ప్రోమోని షో నిర్వాహుకులు రిలీజ్ చేశారు.

Also read : Thandel – Robinhood : నితిన్ వర్సెస్ నాగచైతన్య.. డిసెంబర్‌లో తండేల్‌తో రాబిన్‌ హుడ్ పోటీ..

ఈ సీజన్ లో ప్రస్తుత టాలీవుడ్ యంగ్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. ఇక ఈ స్టార్స్ తో సుధీర్ నవ్వుల సుడిగాలిని సృష్టించబోతున్నారు. ప్రోమో అయితే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా కనిపిస్తుంది. దీంతో ఈ సీజన్ పై ఆడియన్స్ కి మంచి ఆసక్తి కలిగింది. కాగా ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ని ఏప్రిల్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మరి ఆ ఎంటర్టైనింగ్ ప్రోమోని మీరు కూడా చూసి నవ్వుకోండి.

ట్రెండింగ్ వార్తలు