Gorre Puranam : తెలుగు ఓటీటీ ఆహాలో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఎప్పట్నించి అంటే..

తాజాగా మరో కంటెంట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

Suhas Gorre Puranam Movie Streaming Soon in Aha OTT Details Here

Gorre Puranam : తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటీటీ ఆహా. ఓటీటీ మొదలయిన దగ్గర్నుంచి రెగ్యులర్ గా కొత్త సినిమాలు, పలు రకాల షోలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రతి వారం డైరెక్ట్ కొత్త సినిమాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా తీసుకొస్తుంది తెలుగు ప్రేక్షకుల కోసం. తాజాగా మరో కంటెంట్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘గొర్రె పురాణం’. ఇటీవల సెప్టెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రానుంది గొర్రె పురాణం సినిమా. ఈ సినిమా ఆహా ఓటీటీలో దసరా కానుకగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read : Samantha : చాన్నాళ్ల త‌రువాత సినీ మీడియా ముందుకు స‌మంత‌.. అలియా కోసం..

సుహాస్ హీరోగా మొదటి సినిమా కలర్ ఫోటో డైరెక్ట్ ఆహా ఓటీటీలోనే రిలీజయి భారీ విజయం సాధించి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అప్పట్నుంచి వరుసగా ప్రయోగాలు చేస్తూ కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హిట్స్ కొడుతున్నాడు సుహాస్. ఇప్పుడు గొర్రె పురాణం సినిమాతో థియేటర్స్ లో పలకరించగా మళ్ళీ తనకు కలిసొచ్చిన ఆహాలో ప్రేక్షకులని అలరించబోతున్నాడు.

సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపై మేము ఇష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామంటే ఆహా లాంటి వేదికలు మాకు సపోర్ట్ చేయడమే కారణం అని అన్నారు. ఒక ఊళ్ళో ఓ గొర్రె వల్ల రెండు మతాల మధ్య గొడవలు వస్తే ఏం జరిగింది, సుహాస్ కి ఆ గొర్రెకు సంబంధం ఏంటి అనే కథాంశంతో ఈ గొర్రె పురాణం సినిమాని తెరకెక్కించారు. గొర్రెకు తరుణ్ భాస్కర్ వాయిస్ ఇవ్వడం గమనార్హం.