Suhas : అవును.. రెమ్యునరేషన్ పెంచాను.. ఏ నేను బతకొద్దా? సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సందర్భంగా ఇటీవల వరుస సక్సెస్ లు వస్తుండటంతో రెమ్యునరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని సుహాస్ ని అడగగా..
- Saketh U
- Published On : March 7, 2024 / 01:21 PM IST
Suhas Interesting Comments on his Remuneration in Prasanna Vadanam Teaser Launch Event
Suhas : షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సుహాస్. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతిలో చాలా సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి సుహాస్ కి. ఇటీవల అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సుహాస్. ఇప్పుడు త్వరలో ‘ప్రసన్న వదనం'(Prasanna Vadanam) సినిమాతో రాబోతున్నాడు.
తాజాగా ప్రసన్న వదనం టీజర్ రిలీజయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు సుహాస్. ఈ సందర్భంగా ఇటీవల వరుస సక్సెస్ లు వస్తుండటంతో రెమ్యునరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగారు. దీనికి సుహాస్ సమాధానమిస్తూ.. అవును పెంచాను. ఏ నేను బతకొద్దా? జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అని అన్నారు.
అయితే 3000 నుంచి 3 కోట్ల వరకు ఎదిగారు అని టాక్ వినిపిస్తుంది నిజమేనా అని అడగగా సుహాస్.. 1000 రూపాయల నుంచి 3 కోట్లు అనుకో, మరీ అంత తీసుకోవట్లేదు లెండి అని అన్నారు. దీంతో సుహాస్ నిజంగానే రెమ్యునరేషన్ పెంచారని కన్ఫర్మ్ ఇచ్చేశారు. దాదాపు కోటి రూపాయల పైనే సుహాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే కష్టపడి పైకి వచ్చి, సక్సెస్ లు కొట్టేవాళ్ళు వాళ్ళ మార్కెట్ కి తగ్గట్టు తీసుకోవడంలో తప్పులేదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
