Prasanna Vadanam : మరో కొత్త కాన్సెప్ట్‌తో సుహాస్.. ‘ప్రసన్న వదనం’ టీజర్ రిలీజ్.. ఫేస్ బ్లైండ్‌నెస్ జబ్బుతో..
సుహాస్ కొత్త సినిమా ప్రసన్న వదనం టీజర్ చూశారా?

Suhas New Movie Prasanna Vadanam Teaser Released
Prasanna Vadanam Teaser : కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ తో హిట్ కొట్టిన సుహాస్ ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో రాబోతున్నాడు.
సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా.. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా.. పలువురు ముఖ్య పాత్రల్లో కొత్త దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా ఈ ప్రసన్న వదనం సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Also Read : Prabhas : ప్రభాస్‌ని ఫోటో తీస్తున్న దిశాపటాని.. ‘కల్కి’ షూట్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారుగా..
ప్రసన్న వదనం టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా క్రైం థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సుహాస్ కి ఎవరి ఫేస్ సరిగ్గా కనపడని, గుర్తుపట్టలేని.. ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బు ఉన్నట్టు చూపించారు. దీంతో ఈసారి కూడా సుహాస్ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు అర్ధమవుతుంది. సుహాస్ ప్రసన్న వదనంతో కూడా హిట్ కొట్టి సక్సెస్ ని ఇలానే కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.