Suhas : ఈసారి ‘మండాడి’తో మాములుగా ఉండదు.. నెగిటివ్ షేడ్స్ లో సుహాస్..

ఈ సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. (Suhas)

  • Published on- August 20, 2026 / 08:13 AM IST

Suhas

Suhas : తెలుగు నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న సినిమా మండాడి. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘మండాడి’. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్.. పలువురు కీలక పాత్రలు పోషించారు. మండాడి సినిమా సెప్టెంబర్ 10న తమిళ్, తెలుగు, మలయాళం, హిందీలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది.

Also See : Ashika Ranganath : ఆషికా అందాలు అదరహో.. అప్పుడే పదేళ్లు.. ఫొటోలు..

ఈ సినిమాలో సుహాస్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగులో కామెడీ పాత్రలతో, హీరోగా, విలన్ గా మెప్పించిన సుహాస్ ఇప్పుడు తమిళ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, బోట్ పోటీలతో ఆసక్తిగా ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అందర్నీ మెప్పించింది. తాజాగా సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇంటెన్స్ లుక్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇందులో సుహాస్ మేకోవర్, చేతికి ఉన్న ఉంగరం, గడియారం హైలెట్ అవుతున్నాయి. ఈ లుక్ చూస్తుంటే సుహాస్ ఏదో యాక్షన్ సీక్వెన్స్‌కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో సుహాస్ తన నటనతో అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.