Sukumar Daughter : ఇంటర్నేషనల్ స్టేజిపై సుకుమార్ కూతురు సింగర్ గా అదరగొట్టిందిగా.. సుకృతి వీడియో వైరల్..
తాజాగా సుకృతి సౌత్ కొరియాలో ఓ కాన్సర్ట్ లో మెయిన్ సింగర్ గా పెర్ఫార్మ్ చేసి అందర్నీ మెప్పించింది. (Sukumar Daughter)
- Saketh U
- Published On : March 16, 2026 / 08:41 PM IST
Sukumar Daughter
Sukumar Daughter : స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఇప్పటికే గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది. ఆ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నేషనల్ అవార్డు అందుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న సుకృతి ఇప్పుడు సింగర్ గా అందర్నీ మెప్పిస్తుంది.
తాజాగా సుకృతి సౌత్ కొరియాలో ఓ కాన్సర్ట్ లో మెయిన్ సింగర్ గా పెర్ఫార్మ్ చేసి అందర్నీ మెప్పించింది. సౌత్ కొరియాలో జరిగిన ఓ కాన్సర్ట్ లో ఇంగ్లీష్ సాంగ్ తో హాలీవుడ్ స్టైల్ సింగింగ్ తో సుకృతి అదరగొట్టింది. సుకృతి పాడిన వీడియోని సుకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తన కూతురు పాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. చాలా గర్వంగా అంది. సుకృతి సౌత్ కొరియా జేజులో ఉన్న AMIS లో పెర్ఫార్మ్ చేసింది. తన డెడికేషన్, ప్రాక్టీస్, ప్రేమ ఇవన్నీ తను ఇంటర్నేషనల్ స్టేజ్ కి చేరుకోడానికి ఉపయోగపడ్డాయి. ఒక తండ్రిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటూ తెలిపారు సుకుమార్.
ఈ వీడియోలో సుకృతి పాడటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక హాలీవుడ్ సింగర్ పాడినంత పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ సాంగ్ పాడటంతో సుకృతిని అంతా అభినందిస్తున్నారు.
మీరు కూడా సుకృతి పాడింది వినేయండి..
Also See : Virosh Haldi Ceremony : హల్దీ వేడుకల ఫోటోలను షేర్ చేసిన విజయ్ – రష్మిక.. క్యూట్ కపుల్ ఫోటోలు వైరల్..
