Sumalatha Devi : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమలత దేవి ఫిర్యాదు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ భార్య‌ సుమలత దేవి (Sumalatha Devi) ఫిర్యాదు చేశారు.

Sumalatha Devi Lodges Complaint at Banjara Hills Police Station

Sumalatha Devi : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ భార్య‌ సుమలత దేవి ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ వర్గానికి చెందిన లేడీ డ్యాన్సర్లు తనపై దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే సుమలత దేవి కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసిన నేపథ్యంలో తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని రఘు మాస్టర్ వర్గం సభ్యులు ఆరోపిస్తున్నారు. మినిట్స్ బుక్ విషయంలోనే వివాదం మొదలైందని వారు చెబుతున్నారు. సుమలత దేవి దౌర్జన్యంగా మినిట్స్ బుక్‌ను తీసుకునేందుకు ప్రయత్నించడంతో తాము అడ్డుకున్నామని రఘు మాస్టర్ వర్గానికి చెందిన లేడీ డ్యాన్సర్లు చెబుతున్నారు.

Film Federation : ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమ‌ల‌త కార్య‌వ‌ర్గం ర‌ద్దు..

ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. సుమలత దేవి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. నేడు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సుమ‌ల‌త కార్య‌వ‌ర్గాన్ని పూర్తిగా ర‌ద్దు చేసింది. ఆమెకు మెజారిటీ డ్యాన్స‌ర్స్ మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో తెలుగు సినీ డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలిగా సుమ‌ల‌త త‌న ప‌ద‌విని కోల్పోయింది. అక్టోబ‌ర్ 11న డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.