Bigg Boss Today Promo : అటు అమన్, ఇటు వర్షిణి.. ఎవ్వరు తగ్గేదేలే.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి (17వ రోజు) ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో (Bigg Boss Today Promo ) వచ్చేసింది.
Bigg Boss Season 10 Telugu Day 17 Promo 2 Varshini aman flight for captaincy contender task
Bigg Boss Today Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నేటి (17వ రోజు) ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో వచ్చేసింది. దేబ్జానీ ఏడుస్తుంటే రామ్ ప్రసాద్, నరేష్, రోహిత్‌లు వచ్చి నవ్వించే ప్రయత్నం చేసారు. ఆ తరువాత కెప్టెన్సీ కంటెండర్లుగా మారడానికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ గెలుపు కొమ్మలు.
బజర్ మోగగానే పోటీదారులు పూల్‌లో దూకి అందులో ఉన్న బ్యాగుల్లో ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఆ తరువాత వాటిని తీసుకువచ్చి ఎవరి కలర్ ప్లేమ్స్లో ల్యాండ్ అయ్యేలా విసరాలని చెప్పాడు. ఇందులో వర్షిణి, అమన్‌లు పాల్గొన్నారు. ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడినట్లు ప్రొమోలో కనిపిస్తోంది.
Film Federation : ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు..
అయితే.. చివరల్లో అమన్ రెండు చేతుల్లో రెండు బ్యాగ్స్ పట్టుకుని వర్షిణి భుజాలపై చేతులు వేసి ఆమెను కదలకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ గేమ్‌కు సంచాలక్‌గా ముకేష్ ఉన్నాడు. అతడు అమన్‌ను హెచ్చరించాడు. మరీ అంత ఓవర్‌గా చేయకూడదని అన్నాడు. చూస్తుంటే కెప్టెన్సీ కంటెండర్ కోసం వర్షిణి, అమన్ లు కాస్త గట్టిగానే పోరాడినట్లు అర్థమవుతోంది. ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్త్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
మీరు కూడా నేటి బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..
