మిర్చి శివ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న తమిళ సినిమా ‘సుమో’ ట్రైలర్ విడుదల..
రేడియో జాకీ నుండి యాక్టర్‌గా టర్న్ అయ్యి, పలు తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మిర్చి శివ హీరోగా ‘సుమో’ అనే సినిమా రూపొందుతుంది. డా.ఇషారి కె గణేష్ సమర్పణలో.. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుండగా.. ఎస్.పి. హోషిమిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రియా ఆనంద్ కథానాయిక.
యోషినోరి తాషిరో (సుమో) కోలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. VTV గణేష్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ‘సుమో’ ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరోకి సముద్రపు ఒడ్డున సుమో దొరకడం.. అక్కడినుండి అతని గురించి తెలుసుకుని చివరకు జపాన్ చేరుకోవడం..
అతని వెనకున్న కథని, దాని వెనకున్న సమస్యను తెలుసుకుని దానిని సాల్వ్ చేయడం ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజీవ్ మేనన్ విజువల్స్, నివాస్ కె ప్రసన్న ఆర్ఆర్ బాగున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పొంగల్ కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.