Michael : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ‘సందీప్ కిషన్’ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మైఖేల్’ అనే ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు రంజిత్ జేయకుడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ రిలీజ్ అయ్యి అందర్నీ ఆకట్టుకోగా, న్యూ ఇయర్ కానుకగా మూవీలోని మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.
Sundeep Kishan: మైఖేల్ లుక్లో అదరగొట్టిన సందీప్ కిషన్!
ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ నటించింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో మూవీలోని ప్రధాన పాత్రలన్నీ చూపించే విధంగా డిజైన్ చేశారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా కథ మొత్తం 90 కాలంలో జరగనుంది. నటుడిగా హిందీతో పాటు సౌత్లోను పలు భాషలో నటించిన సందీప్ ఈ సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాలి. కాగా ఈ సినిమాతో పాటు తమిళ హీరో ధనుష్ పాన్ ఇండియా మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
Meet the Man who Loved the Hardest #MICHAEL ?
Worldwide only in Theatres on
Feb 3rd, 2023 ?#MichaelfromFEB3rd ??@VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/5NEnI0KZgW— Sundeep MICHAEL Kishan (@sundeepkishan) January 3, 2023